నాటకానికి సామాజిక ప్రయోజం ముఖ్యం | Sakshi
Sakshi News home page

నాటకానికి సామాజిక ప్రయోజం ముఖ్యం

Published Thu, Nov 17 2016 10:49 PM

నాటకానికి సామాజిక ప్రయోజం ముఖ్యం

విజయవాడ కల్చరల్‌ : నాటకానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ డి.విజయభాస్కర్‌ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ క్రియేషన్స్‌ ఆంధ్ర ప్రదేశ్‌ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర అభివృద్థి సంస్థలు సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించిన ద్వితీయ ఆహ్వాన నాటకోత్సవాల ముగింపు సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయభాస్కర్‌ మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ క్రియేన్స్‌ నాటక సంస్థను మహిళలే నిర్వహిస్తున్నారని, అందరూ స్త్రీల పాత్రలతో నాటక పోటీలు నిర్వహిస్తే భాషా సంస్కృతిక శాఖ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నాటకరంగంలో అన్నిశాఖలను మహిళలే నిర్వహించేలా ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ కార్యదర్శి ఎస్. రాజేశ్వరి, కోశాధికారి ఎం.చాందిని, అధ్యక్షులు వై.భవాని తదితరులు ప్రసంగించారు. అనంతరం పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీచేశారు. మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు, మహేశ్వరీప్రసాద్‌ కామెడీ క్లబ్‌ అధ్యక్షుడు బాల గంగాధర తిలక్, నటుడు దర్శకుడు సుఖమంచి కోటేశ్వరరావు, బాలయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. నాటకాలు ప్రదర్శించిన సంస్థలకు డాక్టర్‌ విజయభాస్కర్‌ జ్ఞాపికలు, నగదుపారితోషికం అందించారు. మధు థియేటర్స్‌ తుళ్లూరు ప్రదర్శించిన నిశ్శబ్ద సంకేతం, వెలగలేరు థియేటర్స్‌ సంస్థ ప్రద్శించిన ఎవరికి ఎవరు నాటకం సామాజిక అంశాలను ప్రస్తావించాయి.
 

Advertisement
Advertisement