అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | man suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Sep 24 2016 1:51 AM | Updated on Sep 4 2017 2:40 PM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

దగదర్తి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సున్నపుబట్టి సమీపంలో నేషనల్‌ హైవే పక్కనే ఉన్న కార్తీకవనంలో శుక్రవారం జరిగింది.

 
దగదర్తి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సున్నపుబట్టి సమీపంలో నేషనల్‌ హైవే పక్కనే ఉన్న కార్తీకవనంలో శుక్రవారం జరిగింది. సీఐ గంగా వెంకటేశ్వర్లు కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట దర్బలమిట్టకు చెందిన బత్తల ఆంజనేయులు (50) భార్య కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో, పిల్లలు వేరేగా ఉండటంతో రెండేళ్ల క్రితం సున్నపుబట్టికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఆంజనేయులు తనకు సన్నిహితంగా ఉండే మరోక వ్యక్తితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అతను కార్తీకవనంలో మృతి చెందడంపై అనేక అనుమానాలకు తావిస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి తలపై గాయాలు కూడా ఉండటం అనుమానాలకు బలం చేకూర్చుతుంది. ఘర్షణ పడిన వ్యక్తే ఆంజనేయులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో విషగుళికలు వేసినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement