ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌.. వ్యక్తి మృతి | man dies of road accident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌.. వ్యక్తి మృతి

Jul 6 2017 9:53 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఆటోను వెనుక వైపు నుంచి ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం కొడికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది.

చిలమత్తూరు : ఆటోను వెనుక వైపు నుంచి ట్రాక్టర్‌ ఢీకొన్న  ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం కొడికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక జిల్లా జర్ల  గ్రామం వైపు నుంచి  కొడికొండ వైపు  ఆటో వస్తోంది.  సోమఘట్ట వైపు నుంచి కొడికొండ వైపు వస్తున్న ట్రాక్టర్‌లో చెడిపోయిన బైక్‌ను తీసుకుని బలిజపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (39) వస్తున్నాడు. ఈ క్రమంలో ఆటోను వెనుక వైపు నుంచి ట్రాక్టర్‌ ఢీకొంది. ట్రాక్టర్‌లో ఉన్న నాగరాజు తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని హిందూపురం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement