గోదావరి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

గోదావరి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

May 27 2016 4:39 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి గోదావరిలో పడి మృతిచెందాడు.

బూర్గంపాడు (ఖమ్మం) : వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి గోదావరిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండల కేంద్రంలో గౌతమీపురం కాలనీకి చెందిన గుమ్మలాపురం ప్రసాద్(34) బైక్ పై భద్రాచలం వెళ్తున్న సమయంలో.. గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ బైక్ పై నుంచి ఎగిరిపడి గోదావరిలో పడ్డాడు.

ఈ క్రమంలో బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ తీగలపై పడి అవి తెగి ఇసుకలో కూరుకుపోయి.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం చూడలేదని, కారు అతి వేగంగా ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement