కరెంట్ షాక్ తో కార్మికుని మృతి | Man dies after electrocution | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ తో కార్మికుని మృతి

May 19 2016 8:19 AM | Updated on Oct 9 2018 5:39 PM

కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగాపూర్ గ్రామశివారులో ఉన్న ఇటుక బట్టీ వద్ద విద్యుదాఘాతంతో బూడిద శంకర్(45) అనే వ్యక్తి మృతిచెందాడు.

మంథని: కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగాపూర్ గ్రామశివారులో ఉన్న ఇటుక బట్టీ వద్ద విద్యుదాఘాతంతో బూడిద శంకర్(45) అనే వ్యక్తి మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున లారీలోకి ఇటుకలు చేరుస్తుండగా ప్రమాదవశాత్తూ పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో బూడిద శంకర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గోదావరి ఖని వాసిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement