చెరువులో పడి వ్యక్తి మృతి | Man dead In canal | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Aug 21 2016 11:33 PM | Updated on Oct 9 2018 5:43 PM

బొంరాస్‌పేట : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపూర్‌కు చెందిన వెంకటయ్య (36) స్థానికంగా కూలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

బొంరాస్‌పేట : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపూర్‌కు చెందిన వెంకటయ్య (36) స్థానికంగా కూలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య సునీతతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన అతను ఆదివారం మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతుండగా ఆదివారం మధ్యాహ్నం బొంరాస్‌పేట మండలం దుప్‌చర్ల శివారులోని దేవునిచెరువులో శవమై తేలడంతో బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడి ఆనవాళ్లను బట్టి వెంకటయ్య ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి బంధువులకు అప్పగించారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement