breaking news
Bomraspet
-
వయసు వందకు పైనే.. ‘ఔరా’ అనిపిస్తున్న బామ్మలు
నేటి ఉరుకులు, పరుగుల జీవితం.. ఆహారపు అలవాట్ల నేపథ్యంలో మనషులు నలభై ఏళ్లు దాటితే అనేక రోగాలతో సతమతమవుతున్నారు. 60 ఏళ్లు దాటి ఆరోగ్యంగా ఉండటం అంటే అతిశయోక్తి అన్న మాదిరిగా మారింది. కొందరు మహిళలు వృద్ధాప్యంలోనూ ఎంతో చురుకుగా ఉంటూ ఔరా.. అనిపిస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటున్నారు. పాతకాలం ఆహారమైన గట్కా, సంకటి, అంబలి ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు. సాక్షి, వికారాబాద్: పైన చిత్రంలో పనిచేస్తున్న వృద్ధురాలిది బొంరాస్పేట మండలం చౌదర్పల్లి. ఆమె పేరు సాయమ్మ (103). వందేళ్లు దాటినా ఇప్పటికీ తాను పొలం పనుల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. తనకు ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పింది. చదవండి: సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్.. రెండో చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కీరిబాయి(92), గ్రామం పోల్కంపల్లి తండా. ప్రస్తుతం ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. వందేళ్లు సమీపిస్తున్నా నిత్యం తన పనులు తాను చేసుకుంటూ పొలం పనులు కూడా చేస్తూ కుటుంబీకులకు ఆసరాగా ఉంటోంది. -
చెరువులో పడి వ్యక్తి మృతి
బొంరాస్పేట : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపూర్కు చెందిన వెంకటయ్య (36) స్థానికంగా కూలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య సునీతతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన అతను ఆదివారం మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతుండగా ఆదివారం మధ్యాహ్నం బొంరాస్పేట మండలం దుప్చర్ల శివారులోని దేవునిచెరువులో శవమై తేలడంతో బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడి ఆనవాళ్లను బట్టి వెంకటయ్య ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి బంధువులకు అప్పగించారు.