తాడేపల్లిగూడెం రూరల్ : మద్యం మత్తులో జరిగిన గలాటా ఒకరి మృతికి కారణమైంది.
మద్యం మత్తులో గలాటా .. ఒకరి మృతి
Aug 11 2016 1:42 AM | Updated on May 25 2018 2:06 PM
తాడేపల్లిగూడెం రూరల్ : మద్యం మత్తులో జరిగిన గలాటా ఒకరి మృతికి కారణమైంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టాఫీసు రోడ్డులోని ఊర్వశి వైన్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో టాక్సీ డ్రైవర్లు సత్తిబాబు, కృపారావు కలిసి రామిశెట్టి శ్రీనివాస్‌తో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో వారిద్దరూ కలిసి శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్(31) మృతి చెందాడు. మృతుడు పడాల గ్రామ వాసి. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక స్వీట్స్ కార్ఖానాలో కూలీగా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు (18నెలలు) ఉన్నారు. దీంతో సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


