వృద్ధుడు ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

వృద్ధుడు ఆత్మహత్య

Dec 20 2016 11:16 PM | Updated on Jul 6 2019 12:36 PM

ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రెడ్డిపల్లికి చెందిన లక్ష్మన్న (80), సుంకమ్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె. ఆమెకు వివాహమై బెంగుళూరులో ఉంటోంది. సుంకమ్మ ఆరు నెలల క్రితం చనిపోయింది.

బుక్కరాయసముద్రం : ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రెడ్డిపల్లికి చెందిన లక్ష్మన్న (80), సుంకమ్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె. ఆమెకు వివాహమై బెంగుళూరులో ఉంటోంది. సుంకమ్మ ఆరు నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మన్న ఇరుగుపొరుగు వారు పెట్టే ఆహారం తింటూ కాలం వెళ్లదీసేవాడు. ఇటీవల అనారోగ్యం బారినపడటం, ఒంటరి జీవితంపై విరక్తి చెందడంతో మంగళవారం మధ్యాహ్నం ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement