ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న | Man brutally murdered | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న

Oct 16 2016 11:44 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి సొంత పిన్ని, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు.

గురజాల (గుంటూరు) : ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి సొంత పిన్ని, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తమ్ముడు మృతిచెందగా.. పిన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అన్నపురెడ్డి కోటేశ్వర్రావు, అన్నపురెడ్డి రమేష్(31) ల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి వివాదం నెలకొని ఉంది.

ఈ విషయంపై వారి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. తమ్ముడి ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ఆశించిన కోటేశ్వర్రావు ఆదివారం ఉదయం రమేష్ ఇంటికి వచ్చి అతనితో గొడవకు దిగాడు. కత్తితో రమేష్‌పై దాడి చేశాడు. అడ్డొచ్చిన పిన్ని అరుణను కూడా విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిద్దనిరి ఆస్పత్రికి తరలించగా.. రమేష్ మృతిచెందాడు. అరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement