మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు | mallanna hundi income is rs. 1.29cr | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు

Dec 10 2016 9:13 PM | Updated on Oct 8 2018 9:10 PM

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు - Sakshi

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు

శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌ గుప్త తెలిపారు.

శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌ గుప్త తెలిపారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు  36.650 గ్రాముల బంగారు, 2.150 కిలో గ్రాముల వెండి వచ్చిందన్నారు. గత నెల 25 నుంచి శనివారం వరకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement