కమీషన్ల కోసమే పట్టిసీమ | M M Pallam raju takes on TDP and BJP Govts | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసమే పట్టిసీమ

Aug 11 2015 1:54 PM | Updated on Mar 23 2019 9:10 PM

పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ముందుకు తీసుకొచ్చిందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఆరోపించారు.

కాకినాడ : పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ముందుకు తీసుకొచ్చిందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఆరోపించారు.  మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనీ కోరుతూ అఖిలపక్షాలు చేపట్టిన బంద్లో పల్లంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు రైతుల కోసం కాదని... కేవలం కమీషన్ల కోసమే టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారణంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా గురించి కనీసం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని.. బీజేపీ ప్రభుత్వం ప్రణాళికా సంఘంతో సమీక్షించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడే ఉందని తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పల్లంరాజు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement