ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | love couple commit to sucide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Jun 30 2016 2:03 AM | Updated on Apr 7 2019 4:36 PM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - Sakshi

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించగా యువకుడు మృతిచెందగా..

యువకుడి మృతి, బయటపడిన బాలిక
మొయినాబాద్‌లో ఘటన

 మొయినాబాద్ : ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించగా యువకుడు మృతిచెందగా.. బాలిక క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన ఎం.నవీన్(23) న్యూబోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా చేస్తున్నాడు. నవీన్‌కు కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలిక(17)తో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.

బాలిక బుధవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి.. నవీన్‌ను కలిసింది. ఇద్దరు కలసి జూపార్కుకు వెళ్లారు. మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేసి అక్కడి నుంచి మొయినాబాద్‌కు చేరుకున్న వారు.. సురంగల్ రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడ్డ రేకుల షెడ్‌లోని ఓ గదిలోకి వెళ్లారు. పై కప్పు పైపునకు కేబుల్ వైరు కట్టి ఇద్దరు ఉరివేసుకున్నారు. నవీన్ మెడకు ఉరి బిగించుకుంది. బాలిక మెడకు వేసుకున్న వైరు తెగిపోవడంతో ఆమె కిందపడింది. ఏం చేయాలో అర్థంకాక నవీన్‌ను కాపాడేందుకు విఫలయత్నం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement