భోగాపురం సన్ రే బీచ్లో చిన్నారి మృతదేహం! | local people identify unknown child's body found at boghapuram beach | Sakshi
Sakshi News home page

భోగాపురం సన్ రే బీచ్లో చిన్నారి మృతదేహం!

Oct 1 2015 7:12 PM | Updated on Apr 3 2019 5:32 PM

భోగాపురం సన్ రే బీచ్లో చిన్నారి మృతదేహం! - Sakshi

భోగాపురం సన్ రే బీచ్లో చిన్నారి మృతదేహం!

విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది.

విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది.  మృతదేహాన్ని గమనించిన స్థానికులు ...పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆ మృతదేహం  వారం క్రితం (గత గురువారం) విశాఖలో డ్రెయినేజీ లో పడి గల్లంతైన అదితి మృతదేహంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

 

దీనిపై స్థానిక పోలీసులు... విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతో పాటు, అదితి తండ్రి కూడా ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా చిన్నారి మృతదేహంపై పింక్ కలర్ డ్రస్ ఉన్నట్లు... వయసు ఆరు నుంచి ఏడేళ్లు ఉండవచ్చని  సీఐ వైకుంఠరావు తెలిపారు.  మృతదేహం నీళ్లలో నాని ఉండటంతో ఆనవాళ్లు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement