విధులు బహిష్కరించిన న్యాయవాదులు | lawyers boycott | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Feb 17 2017 12:22 AM | Updated on Sep 5 2017 3:53 AM

అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టు న్యాయవాది సునిత హత్యను ఖండిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

కర్నూలు(లీగల్‌): అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టు న్యాయవాది సునిత హత్యను ఖండిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మహిళా న్యాయవాది సునీతను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పి.రవిగువేరా, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సి.వి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కూడా విధులు బహిస్కరించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు డి.సాయిలీల, యు.వి.లక్ష్మి, గీతామాధురి, జయలక్ష్మి, లక్ష్మిబాయి, హైమావతి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement