విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం | Law student raped in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం

Aug 20 2015 11:41 AM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.

విశాఖపట్నం: విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో సీనియర్ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.

నిన్న రాత్రి విద్యార్థులందరూ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మద్యం సేవించినట్టు తెలుస్తోంది. బాధితురాలు ఎంవీపీ పోలీసు స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో పాటు నిందితుడిని వైద్య పరీక్షలకు పంపినట్టు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన రాషీబ్ సింగ్ కాగా, విద్యార్థిని లక్నో వాసి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement