'లోకేష్పై సీబీఐతో విచారణ చేయించే దమ్ముందా' | laksmi parvatichallenged AP Chief Minister | Sakshi
Sakshi News home page

'లోకేష్పై సీబీఐతో విచారణ చేయించే దమ్ముందా'

Mar 21 2016 2:15 PM | Updated on Aug 11 2018 9:14 PM

అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు చేసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మిపార్వతి ఆరోపించారు.

- చంద్రబాబు నాయుడికి లక్ష్మి పార్వతి సవాల్
విజయవాడ:
అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు చేసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మిపార్వతి ఆరోపించారు. విజయవాడలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలులో బడాబాబుల పాత్ర ఉందని.. అందుకే విచారణ ముందకు సాగటం లేదని అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దమ్ముంటే.. అగ్రిగోల్డ్ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని సవాల్ చేశారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు ఇచ్చేయాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement