యువకుల ర్యాష్‌ డ్రైవింగ్‌.. యువతికి తీవ్రగాయాలు | lady injured of road accident | Sakshi
Sakshi News home page

యువకుల ర్యాష్‌ డ్రైవింగ్‌.. యువతికి తీవ్రగాయాలు

Mar 12 2017 11:41 PM | Updated on Aug 30 2018 4:10 PM

యువకుల ర్యాష్‌ డ్రైవింగ్‌.. యువతికి తీవ్రగాయాలు - Sakshi

యువకుల ర్యాష్‌ డ్రైవింగ్‌.. యువతికి తీవ్రగాయాలు

త్రిబుల్‌ రైడింగ్‌.. ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగిన ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది.

త్రిబుల్‌ రైడింగ్‌.. ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగిన ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాత్రి 8.50 గంటల సమయంలో నగరంలోని సుభాష్‌రోడ్డు నుంచి సునీత అనే యువతి తన మామతో కలిసి సప్తగిరి సర్కిల్‌ వైపు ద్విచక్రవాహనంలో వెళుతోంది. రఘువీరాటవర్‌ సమీపంలోకి రాగానే వీరి ద్విచక్రవాహనం స్లో చేసి రోడ్డుపక్కగా వచ్చారు. ఈ క్రమంలో కిందపడిపోతున్న సునీతను అతి వేగంతో వస్తున్న ముగ్గురు యువకులు తమ ద్విచక్రవాహనంతో ఢీకొని ముందుకెళ్లారు. ఆ యువతి గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన పడింది. మూగదెబ్బలు తగలడంతో స్పృహ తప్పింది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement