కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే | krishnapatnam to china | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే

Aug 29 2016 11:03 PM | Updated on Sep 4 2017 11:26 AM

కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే

కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే

ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి చైనాకు కేవలం 14 రోజుల్లో కంటైనర్ల నౌక ద్వారా సరుకుల రవాణా జరుగుతుందని పోర్టు సీఈఓ అనీల్‌ ఎండ్లూరి వెల్లడించారు. ప్రతి వారం చైనాకు సరుకుల కంటైనర్ల రవాణా చేసే తొలి నౌక ‘ఎంవీ మాస్క్‌ కైరెనియా’ను సోమవారం పోర్టులో మెర్స్క్‌లైన్‌ ఇండియా ఎండీ ఫ్రాంక్‌ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్‌ ఎండ్లూరి ప్రారంభించారు.

 
  • తొలి నౌకాయానం ప్రారంభం 
ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి చైనాకు కేవలం 14 రోజుల్లో కంటైనర్ల నౌక ద్వారా సరుకుల రవాణా జరుగుతుందని పోర్టు సీఈఓ అనీల్‌ ఎండ్లూరి వెల్లడించారు.  ప్రతి వారం చైనాకు సరుకుల కంటైనర్ల రవాణా చేసే తొలి నౌక ‘ఎంవీ మాస్క్‌ కైరెనియా’ను సోమవారం పోర్టులో మెర్స్క్‌లైన్‌ ఇండియా ఎండీ ఫ్రాంక్‌ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్‌ ఎండ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తూర్పు, ఈశాన్య దేశాలైన కొరియా, సింగపూర్, మలేసియా, చైనాకు ఇక నుంచి ప్రతి వారం కంటైనర్ల నౌక ప్రయాణిస్తుందని వెల్లడించారు. ఈ నౌకా యానం వల్ల ఖర్చు తగ్గుతుందని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. 
 
కాంకర్‌ రైలు సర్వీసు ప్రారంభం
 బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వారానికి రెండు సార్లు కంటైనర్లు రవాణా చేసే రైలును కూడా మాస్క్‌ ౖలైన్‌ ఇండియా ఎండీ ఫ్రాంక్‌ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్‌ ఎండ్లూరి ప్రారంభించారు. కాంకర్‌ సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతంగా ఈ రవాణా జరుగుతుందని సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ధనుంజయులు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement