'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది' | kodali nani takes on chandrababu | Sakshi
Sakshi News home page

'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది'

Mar 23 2016 12:29 PM | Updated on May 29 2018 2:33 PM

'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది' - Sakshi

'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు.  బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావుతోపాటు పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, కె.పార్థసారథి, గౌతంరెడ్డి, నగర కార్పొరేటర్లు హాజరయ్యారు.

కొడాలి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ...  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి... మళ్లీ ఎన్నికల్లో గెలివాలి అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ఖాన్పై మండిపడ్డారు. జలీల్ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement