2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి | Kishan Reddy comments on trs govt | Sakshi
Sakshi News home page

2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి

Mar 4 2016 3:06 AM | Updated on Sep 3 2017 6:55 PM

2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి

2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి

2019 నాటికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందని...

ఖమ్మం:  2019 నాటికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి.. డబ్బుంటే అధికారం చేజిక్కించుకోవచ్చనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ధన రాజకీయాలు చేస్తోందన్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని  పిలుపునిచ్చారు. కిషన్‌రెడ్డి వెంట జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement