దళితులను మోసం చేస్తున్న కేసీఆర్
మిర్యాలగూడ టౌన్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పిన కేసీఆర్ గత రెండేళ్లుగా మాదిగలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొకల కిరణ్‌మాదిగ ఆరోపించారు.
మిర్యాలగూడ టౌన్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పిన కేసీఆర్ గత రెండేళ్లుగా మాదిగలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొకల కిరణ్‌మాదిగ ఆరోపించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గ టీ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మాదిగల బతుకులు బాగుపడతాయని అనుకుంటే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పేరుతో తూతూమంత్రంగా పంపిణీ చేసి మరో సారి మాదిగలను మోసం చేశారని అన్నారు. దళితులకు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సెప్టెంబరు నుంచి హైదరాబాద్‌లో ట్యాంకు బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలను చే పడుతామన్నారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ నాయకులు నజీర్‌మహ్మద్, సతీష్, రాములయ్య, విజయ్, రవి, శంకరయ్య, నర్సింహ్మ, జమీనుద్ధీన్, రఫీలతో పాటు పలువురు నాయకులు తదితరులున్నారు.