కాపు నాయకుల దీక్ష భగ్నం..! | kapu leadrs fast for reservations in east godawari district | Sakshi
Sakshi News home page

కాపు నాయకుల దీక్ష భగ్నం..!

Feb 7 2016 10:19 PM | Updated on Jul 30 2018 6:21 PM

కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా కాపు యువత నేతలు చేస్తున్న దీక్షను అధికారులు భగ్నం చేశారు.

పీ గన్నవరం: కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా కాపు యువత నేతలు చేస్తున్న దీక్షను అధికారులు భగ్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం సెంటర్‌లో నిరాహర దీక్ష చేస్తున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆదివారం క్షీణించింది. దీంతో వారి దీక్షను భగ్నం చేసి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాపు రిజర్వేషన్ల కోసం మొత్తం ఎనిమిది మంది ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఆదివారం రాత్రి రెవెన్యూ అధికారులు దీక్షా స్థలికి వద్దకు చేరుకుని దీక్షలో ఉన్న బోడపాటి తాతాజీ, పొలిశెట్టి నాగబాబు, అప్పన సురేష్‌బాబులను ఆస్పత్రికి తరలించారు.

నలుగురు కాపు నాయకుల ఆమరణదీక్ష
నర్సాపురం: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కుప్పర్రు గ్రామంలో నలుగురు ఆదివారం సాయంత్రం ఆరమణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అంకం బన్ను, యాదవరెడ్డి సూరిబాబు, యాదవరెడ్డి రఘుతోపాటు మరొకరు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించేవరకు తమ దీక్ష కొనసాగుతుందని వారు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement