వర్షాల కోసం జలాభిషేకం... | jalabhishekam for Rains | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం జలాభిషేకం...

Aug 25 2016 5:37 PM | Updated on Mar 28 2018 11:26 AM

వర్షాల కోసం జలాభిషేకం... - Sakshi

వర్షాల కోసం జలాభిషేకం...

వర్షాలు కురియాలని కోరుతూ పూడూరు మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి గురువారం జలాభిషేకం చేశారు.

వర్షాల కోసం సోమేశ్వరునికి జలాభిషేకం...
పూడూరు: వర్షాలు కురియాలని కోరుతూ పూడూరు మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి గురువారం జలాభిషేకం చేశారు. ఆలయంలోని ప్రధాన ద్వారాన్ని తాత్కాలికంగా మూసేసి నీటిని నింపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పంటలు పూత, కాత వచ్చే సమయంలో వర్షలు కురియడం లేదన్నారు. నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే తరుణంలో వరుణుడు మొహం చాటేయడంతో పంటలు ఎండుదశలో ఉన్నాయని, జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణిస్తాడనే నమ్మకంతో పూజలు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజలు చేసి, లింగానికి జలాభిషేకం చేశౠరు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షుడు అనీల్‌ యాదవ్‌, ఆలయ చైర్మన్‌ చంద్రశేఖర్‌, బీజేవైఏం నాయకులు రాజు, నరేందర్‌, పాండు, భజన భక్తులు బుచ్చన్న, సుభాన్‌, అనంతయ్య, కిష్టయ్య, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement