స్వయం ఉపాధిలో భాగంగా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీ జిల్లా సహకార ఆర్థిక సంస్థ ఈడీ కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు. వితంతువులు, కుటుంబంలోని ఒంటరి మహిళలు, వెట్టిచాకిరి చేసేవారు. హెచ్‌ఐవీ బాధితులుగా గుర్తించబడిన వారు. మానవ అక్రమ రవాణా బాధితులు అర్హులన్నారు.
రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
Mar 20 2017 11:44 PM | Updated on Aug 20 2018 3:21 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్:
స్వయం ఉపాధిలో భాగంగా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీ జిల్లా సహకార ఆర్థిక సంస్థ ఈడీ కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు.
వితంతువులు, కుటుంబంలోని ఒంటరి మహిళలు, వెట్టిచాకిరి చేసేవారు. హెచ్‌ఐవీ బాధితులుగా గుర్తించబడిన వారు. మానవ అక్రమ రవాణా బాధితులు అర్హులన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా apobmmr.cff.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ నెల 31లోపు మీ సేవ, ఇంటర్‌నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు, మీ సేవ కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫొటోను జతచేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు జిల్లా గిరిజన సహకార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement