భారత పతాకం రెపరెపలాడాలి | Indian flag should be recuperated | Sakshi
Sakshi News home page

భారత పతాకం రెపరెపలాడాలి

Jun 6 2017 11:42 PM | Updated on Jun 1 2018 8:36 PM

అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించాలని ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్‌ క్రీడా మైదానంలో జిల్లా నుంచి భారత సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు, సీనియర్‌ బాల, బాలికల జట్లకు క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించాలని ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్‌ క్రీడా మైదానంలో జిల్లా నుంచి భారత సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు, సీనియర్‌ బాల, బాలికల జట్లకు క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథి ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి ఈ నెల 9 నుంచి 11 వరకు సింగపూర్‌లో జరిగే ఏషియా ఫసిపిక్‌ టోర్నీలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగే సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్రభాకర్, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement