అనుమానంతో ఆలి అంతం | husbend killed he's wife on Suspicion | Sakshi
Sakshi News home page

అనుమానంతో ఆలి అంతం

Jun 16 2016 9:25 AM | Updated on Jul 27 2018 2:18 PM

అనుమానంతో ఆలి అంతం - Sakshi

అనుమానంతో ఆలి అంతం

అనుమానం పెనుభూతమైంది. కమలాపురానికి చెంది న గురిజాల ఉప్పలమ్మ(38)ను ఆమె భర్త శ్రీను మంగళవారం అర్ధరాత్రి గొంతు నులిమి చంపేశాడు.

కమలాపురంలో ఘటన
స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

 కమలాపురం (ముదిగొండ): అనుమానం పెనుభూతమైంది. కమలాపురానికి చెంది న గురిజాల ఉప్పలమ్మ(38)ను ఆమె భర్త శ్రీను మంగళవారం అర్ధరాత్రి గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కమలాపురానికి చెందిన రాయబారపు వెంకయ్య పెద్ద కుమార్తె ఉప్పలమ్మకు 20 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన గురిజాల శ్రీనుతో వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంతకాలంగా భార్య(ఆలి)ని అనుమానంతో వేధిస్తున్నాడు. పెద్దమనుషుల వద్దకు పిలిపించగా..ఇకపై మంచిగా చూసుకుంటానని ఇంటికి తీసుకెళ్లేవాడు.

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంటినుంచి బయల్దేరి 13 కిలోమీటర్లు నడిచివెళ్లి ముందిగొండ చేరుకొని..తహసీల్దార్ కార్యాలయం వద్ద పడుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి..తన భార్యను హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు ఉప్పలమ్మ చనిపోయిందని గుర్తించి..మృతురాలి తండ్రి వెంకయ్య కూడా శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం డీఎస్పీ కొల్లు సురేష్‌కుమా ర్, ఖమ్మం రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ టి.కరుణాకర్ కమలాపురానికి వచ్చి మృతదేహాన్ని పరిశీవలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం రూరల్ సీఐ ఆంజనేయులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement