భార్యపై కత్తితో దాడి | ​husband attacked on wife | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి

Jul 7 2017 8:46 AM | Updated on Mar 28 2018 11:26 AM

భార్యపై కత్తితో దాడి - Sakshi

భార్యపై కత్తితో దాడి

కట్టుకున్న భార్యను ఓ భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది

► ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాలు  
► ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్‌ కాలనీలో ఘటన


ఆమనగల్లు(కల్వకుర్తి): కట్టుకున్న భార్యను ఓ భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రేమ్‌నగర్‌ కాలనీకి చెందిన మీసాల రాజుకు నాలుగు సంవత్సరాల క్రితం అదే కాలనీకి చెందిన బాలు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. బాలును భర్త రాజుతో పాటు అత్తామామలు, మరిది వేధింపులకు గురిచేసేవారు.

దీనికి తోడు భర్త రాజు మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకుని భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ విషయమై బుధవారం రాత్రి బాలు, రాజుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన గుట్టు భార్యకు తెలిసిపోయిందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భార్యపై రాజు కత్తితో దాడి చేసి ఆమె మెడను తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన బాలును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దాడికి యత్నించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధిరాలి సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు భర్త మీసాల రాజు, వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన మీసాల రాజు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement