భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త | husband attack on wife | Sakshi
Sakshi News home page

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

Jul 30 2016 11:41 PM | Updated on Sep 5 2018 9:47 PM

క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన కడప నగర సమీపంలోని అంగడివీధిలో చోటు చేసుకుంది.

చింతకొమ్మదిన్నె: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన  భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన కడప నగర సమీపంలోని అంగడివీధిలో చోటు చేసుకుంది. కడప రూరల్‌ సీఐ వెంకటశివారెడ్డి కథనం మేరకు కడప నగర సమీపంలోని అంగడివీధిలో నివాసముంటున్న ఆలుమూరి శ్రీనివాసులు, ఆలుమూరి కమాల్‌బీలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో క్షణికావేశానికి గురైన భర్త భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన కమాల్‌బీని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement