పుష్కరాలకు భారీ బందోబస్తు | heavy security for pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు భారీ బందోబస్తు

Aug 4 2016 10:31 PM | Updated on Sep 4 2017 7:50 AM

పుష్కరాలకు భారీ బందోబస్తు

పుష్కరాలకు భారీ బందోబస్తు

మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద జరిగే పుష్కరాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సూర్యాపేట డీఎస్పీ సునీతా మోహన్‌ తెలిపారు.

మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద జరిగే పుష్కరాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సూర్యాపేట డీఎస్పీ సునీతా మోహన్‌ తెలిపారు. గురువారం ఆమె మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నూతనంగా నిర్మించిన మట్టి రోడ్డును, చెన్నైకి చెందిన ముక్కూరు స్వామి ఆశ్రమాన్ని, గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల పనులు పూర్తి అవుతున్నందున పోలీస్, అగ్ని మాపక కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నామన్నారు. దేవస్థానం సమీపంలోకి కేవలం వీఐపీ, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తామన్నారు. మిగిలిన వాహనాలన్నీ ఎన్‌సీఎల్‌ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలంలోనే నిలిపివేస్తామన్నారు. ఆమె వెంట సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఉన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement