కిక్కిరిసిన బాసర క్షేత్రం | heavy rush at basara temlpe | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన బాసర క్షేత్రం

Jan 25 2015 8:17 AM | Updated on Sep 2 2017 8:15 PM

ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ పుణ్య క్షేత్రం వసంత పంచమి సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచి భక్తులతో కళకళలాడుతోంది.

బాసర: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ పుణ్య క్షేత్రం వసంత పంచమి సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచి భక్తులతో కళకళలాడుతోంది. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మంచి ముహూర్తాలున్నాయని అక్షరాభ్యాసాలు చేయించే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కూడా సరస్వతీమాత సన్నిధిలో పూజలు చేసేందుకు వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement