జిల్లాలో విస్తారంగా వర్షాలు | heavy rains in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో విస్తారంగా వర్షాలు

Sep 14 2016 10:19 PM | Updated on Sep 4 2017 1:29 PM

జిల్లాలో విస్తారంగా వర్షాలు

జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. జిల్లాలో 6 మిల్లీ లీటర్లు సగటు వర్షపాతం నమోదైంది.

 
ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. జిల్లాలో 6 మిల్లీ లీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడలో సాయంత్రం అర్ధగంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, వన్‌టౌన్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. డ్రెయిన్లలో నీరు పొంగి పొర్లింది. వాహనచోదకులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌ కూడా స్తంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షం వల్ల వరి, పత్తి పైరుకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
– మచిలీపట్నం/విజయవాడ
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement