నగరిలో భారీ వర్షం | Heavy rain in Nagari | Sakshi
Sakshi News home page

నగరిలో భారీ వర్షం

Mar 15 2017 1:20 AM | Updated on Sep 5 2017 6:04 AM

నగరిలో భారీ వర్షం

నగరిలో భారీ వర్షం

మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

పిడుగుపడి రెండు పశువుల మృతి

నగరి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగుపడటంతో కృష్ణరామాపురం గ్రామంలో లక్ష్మీదేవికి చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి. మేతకు వాటిని చెరువు గట్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆకస్మికంగా పిడుగుపడింది. ఆ సమయంలో లక్ష్మీదేవి దూరంగా ఉండటంతో ఆమెకు ప్రమాదం తప్పింది. మృతి చెందిన ఆవు, ఎద్దు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపింది. వీఆర్వో నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

తహసీల్దార్‌కు నివేదిక సమర్పించారు. గంట సేపటికిపైగా భారీగా వర్షం కురవడంతో పట్టణ పరిధిలో జనజీవనం స్తంభించింది. వాహనాలు కూడా రోడ్లపై కాసేపు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆకస్మికంగా వర్షం పడటంతో ఇటుకల తయారీదారులు నష్టపోయారు. పాలసముద్రం మండలంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement