విశాఖ జిల్లా పాడేరు రూరల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
విశాఖపట్నం: విశాఖ జిల్లా పాడేరు రూరల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగుతున్నాయి.