కిటకిటలాడిన రైల్వే స్టేషన్‌ | heavy crowd at railway station | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన రైల్వే స్టేషన్‌

Aug 14 2016 6:54 PM | Updated on Apr 7 2019 3:24 PM

కిటకిటలాడిన రైల్వే స్టేషన్‌ - Sakshi

కిటకిటలాడిన రైల్వే స్టేషన్‌

విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆదివారం కిటకిటలాడింది. రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణించాయి. సెలవు కావడంతో కృష్ణా పుష్కరాలకు యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

విజయవాడ (రైల్వేస్టేషన్‌)  : 
విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆదివారం కిటకిటలాడింది. రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణించాయి. సెలవు కావడంతో కృష్ణా పుష్కరాలకు యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. విశాఖపట్నం, చెన్నై, తిరుపతి, సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చిన రైళ్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్యాసింజెర్‌ రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. శాటిలైట్‌ స్టేషన్లయిన మధురానగర్, గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్‌ జంక్షన్లలోనూ రద్దీ నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డీఆర్‌ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్‌ఎం కె.వేణుగోపాలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement