కొనసాగుతోన్న చలి తీవ్రత | heavy cold in agali | Sakshi
Sakshi News home page

కొనసాగుతోన్న చలి తీవ్రత

Dec 31 2016 10:17 PM | Updated on Mar 28 2019 6:27 PM

జిల్లా వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం కూడా అగళి మండలంలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 10.6 డిగ్రీలు, రొద్దం, తనకల్లు 11.2 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 32 డిగ్రీలు నమోదైంది. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 92, మధ్యాహ్నం 26 నుంచి 36 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement