గడ్డపోతారంలో ఘనంగా హరితహారం | harithaHaaram in Gaddipocharam | Sakshi
Sakshi News home page

గడ్డపోతారంలో ఘనంగా హరితహారం

Jul 27 2016 6:02 PM | Updated on Sep 4 2017 6:35 AM

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పరిశ్రమలు, డ్రగ్‌‌స కంట్రోలర్ అధికారుల ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక వాడలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement