సజావుగా గ్రూప్‌ - 1 మెయిన్స్‌ | group 1 mains exams | Sakshi
Sakshi News home page

సజావుగా గ్రూప్‌ - 1 మెయిన్స్‌

Aug 19 2017 9:40 PM | Updated on Jun 1 2018 8:39 PM

సజావుగా గ్రూప్‌ - 1 మెయిన్స్‌ - Sakshi

సజావుగా గ్రూప్‌ - 1 మెయిన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్‌ - 1 మెయిన్స్‌ పరీక్ష రెండో రోజు శనివారం సజావుగా సాగింది.

- అభ్యర్థుల హాజరు 64 శాతం
- 668 అభ్యర్థులకుగానూ 441 మంది హాజరు
- 247 మంది గైర్హాజరు


అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్‌ - 1 మెయిన్స్‌ పరీక్ష రెండో రోజు శనివారం సజావుగా సాగింది. అభ్యర్థులు 64 శాతం హాజరయ్యారు. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల, ఎస్‌బీఎన్‌ జూనియర్‌ కళాశాలలో పేపర్‌ - 1 పరీక్షకు 668 అభ్యర్థులకు గానూ 441 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఏపీపీఎస్‌సీ అధికారులు బీ.సీహెచ్‌.ఎన్‌.కుమార్‌రాజ్, వసంతకుమార్, సురేశ్‌బాబు పర్యవేక్షించారు.

లైజన్‌ అధికారిగా సురేశ్‌బాబు, అసిస్టెంట్‌ లైజన్‌ అధికారులుగా జయరాముడు, నాగభూషణం వ్యవహరించారు. కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించారు. ప్రవేశద్వారం వద్ద అభ్యర్థులను తనిఖీ చేసి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు లేవని నిర్ధారించుకున్న తర్వాత కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించారు. సోమవారం పేపర్‌ - 2 ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement