సజావుగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష | group-1 mains exam | Sakshi
Sakshi News home page

సజావుగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష

Aug 26 2017 10:03 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఆంధ్రప్రదేశ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష పేపర్‌–4 శనివారం సజావుగా జరిగింది.

అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష పేపర్‌–4 శనివారం సజావుగా జరిగింది. పరీక్ష జరుగుతున్న ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాల కేంద్రాలను కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 688 మంది అభ్యర్థులకుగానూ 410 మంది హాజరైనట్లు కలెక్టర్‌కి డీఆర్‌ఓ చెప్పారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లను చేశామని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ మలోలా, ఏపీపీఎస్‌సీ సహాయ కార్యదర్శులు ఆర్‌.వి.రమణ, మహబూబ్‌బాషా, సుధాకర్‌బాబు, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement