హోరాహోరీగా ఫైనల్స్‌ | grigs games in chiyyedu | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఫైనల్స్‌

Nov 30 2016 11:20 PM | Updated on Sep 4 2017 9:32 PM

హోరాహోరీగా ఫైనల్స్‌

హోరాహోరీగా ఫైనల్స్‌

మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న గ్రిగ్‌పోటీల్లో బుధవారం ఫైనల్స్‌ హోరాహోరీగాస్‌గాయి. విద్యార్థులంతా విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.

అనంతపురం రూరల్‌ : మండల పరిధిలోని చియ్యేడు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న గ్రిగ్‌పోటీల్లో బుధవారం ఫైనల్స్‌ హోరాహోరీగాస్‌గాయి. విద్యార్థులంతా విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.

విజేతలు వీరే
బాలుర జూనియర్స్‌ విభాగం:
కబడ్డీలో పప్పురు గురుకుల పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, రూట్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో విన్సెంటి ది పాల్‌ పాఠశాల జట్టు విన్నర్స్‌గా నిలవగా, బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. త్రోబాల్‌ పోటీల్లో  అనంతపురం న్యూటౌన్‌ పాఠశాల విన్నర్‌గా నిలవగా, శ్రీ చైతన్య పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. టెన్నికాయిట్‌ పోటీల్లో పెనకచెర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విజేతగా నిలవగా, ఆలమూరు ఉన్నత పాఠశాల జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

బాలుర సీనియర్స్‌ విభాగం:
వాలీబాల్‌లో శింగనమల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల జట్టు రెండోస్థానంతో సరిపెట్టుకుంది. త్రోబాల్‌ పోటీల్లో శ్రీచైతన్య పాఠశాల జట్టు విన్నర్స్‌గా, అనంతపురం న్యూటౌన్‌ ఉన్నత పాఠశాల జట్టు రన్నర్స్‌గా నిలిచాయి. టెన్నికాయిట్‌ పోటీల్లో పెనకచెర్ల ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలవగా, వడియంపేట కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు రెెండోస్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement