డెంగీతో విద్యార్థిని మృతి | student dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో విద్యార్థిని మృతి

Sep 30 2016 9:42 PM | Updated on Nov 9 2018 4:36 PM

డెంగీతో విద్యార్థిని మృతి - Sakshi

డెంగీతో విద్యార్థిని మృతి

అనంతపురం రూరల్‌ మండలం చియ్యేడుకు చెందిన వెంకటలక్ష్మి, వెంకటరాముడు దంపతుల కుమార్తె ఈశ్వరమ్మ(14) డెంగీతో శుక్రవారం మరణించింది.

అనంతపురం రూరల్‌ : అనంతపురం రూరల్‌ మండలం చియ్యేడుకు చెందిన వెంకటలక్ష్మి, వెంకటరాముడు దంపతుల కుమార్తె ఈశ్వరమ్మ(14) డెంగీతో శుక్రవారం మరణించింది. అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె శనివారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ రెండ్రోజల పాటు చికిత్స చేసిన తరువాత ఏ జ్వరమో చెప్పకుండా డాక్టర్లు చేతులెత్తేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో హుటాహుటిన బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధరించారన్నారు.

అక్కడ చికిత్స పొందుతూ చివరకు మతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం పెద్దాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మతి చెందిందని వారు ఆరోపించారు. విషయం తెలియగానే వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్‌ వరప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌ ఉజ్జినప్ప, కురుగుంట ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థిని మతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement