గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు | puttaparthy students talent in grigs | Sakshi
Sakshi News home page

గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు

Nov 16 2016 11:32 PM | Updated on Sep 4 2017 8:15 PM

గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు

గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు

ఇటీవల రామగిరిలో జరిగిన పూర్ణిమారావు గ్రిగ్స్‌పోటీల్లో పుట్టపర్తి మండల విద్యార్థులు సత్తా చాటారు.

పుట్టపర్తి అర్బన్‌ : ఇటీవల రామగిరిలో జరిగిన పూర్ణిమారావు గ్రిగ్స్‌పోటీల్లో  పుట్టపర్తి మండల విద్యార్థులు సత్తా చాటారు. మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్‌ బాలుర వాలీబాల్‌లో విన్నర్స్‌గా, సీనియర్‌ బాలికలు  షటిల్‌లో విన్నర్స్, బాలికల హాకీలో రన్నర్స్, జూనియర్‌ షటిల్‌లో గర్ల్స్‌ రన్నర్స్‌గా పథకాలు సాధించారని పీడీ నాగరాజు, హెచ్‌ఎం రామచంద్రారెడ్డి తెలిపారు.

అదేవిధంగా బీడుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్‌ క్రికెట్‌ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచినట్లు పీఈటీ వెంకటేష్‌, హెచ్‌ఎం గురుప్రసాద్‌ పేర్కొన్నారు.  మండల పరిధిలోని జగరాజుపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు సీనియర్‌ బాలికల బాల్‌బ్యాడ్మిటన్‌లో రన్నర్స్, సీనియర్‌ బాలుర చెస్‌లో రన్నర్స్, సీనియర్‌ బాలుర బ్యాడ్మిటన్‌లో రన్నర్స్‌గా నిలిచి పతకాలు సాధించినట్లు పీఈటీ అజీంభాష, హెచ్‌ఎం రాజేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement