‘పాపన్న’ జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి | government should conduct papanna jayanti | Sakshi
Sakshi News home page

‘పాపన్న’ జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి

Aug 6 2016 7:35 PM | Updated on Sep 4 2017 8:09 AM

సర్దార్‌ పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ఆశన్నగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

కొండాపూర్: సర్దార్‌ పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ఆశన్నగౌడ్‌ డిమాండ్‌ చేశారు. కొండాపూర్‌లో గల గౌడ సంఘం కార్యాలయంలో శనివారం గౌడ సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి పాపన్నగౌడ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 10 వరకు బస్సుయాత్ర ప్రారంభించామన్నారు. ఈ   యాత్ర 7న మెదక్‌ జిల్లా రామాయంపేటకు చేరుతుందన్నారు.

8న మెదక్, నర్సాపూర్, దౌల్తాబాద్‌ల మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుందన్నారు.అనంతరం మద్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డిలో గల ప్రెస్‌క్లబ్‌ల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈయాత్రకు జిల్లాలోని నలుమూలల నుండి గౌడ కులస్థులు, కల్లుగీత కార్మికులు, టీసీఎస్, టీఎఫ్‌టగీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. 

కార్యక్రమంలో బీసీ మండల అధ్యక్షుడు క్రిష్ణాగౌడ్, నాయకులు రామాగౌడ్, మల్లేశంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, అంజాగౌడ్, రమేష్‌గౌడ్, యాదాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement