breaking news
papanna jayanti
-
18న పాపన్న జయంతి
రామాయంపేట: అన్ని గ్రామాల్లో ఈనెల 18న సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని గౌడ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టాగౌడ్, జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి మధునాల స్వామీగౌడ్, మండలశాఖ ప్రతినిధులు మధునాల సిద్దరాంలుగౌడ్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ , శంకర్‌గౌడ్ తదితరులు మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.18న రామాయంపేటలోని ఎల్లమ్మ ఆలయంవద్ద ప్రతిష్టించిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాంవద్ద వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామాలవారీగా జయంతివేడుకలు జరుపుకోవాలని, ఇందుకుగాను గ్రామాల్లోఉన్న సంఘం యువత, మహిళా విభాగం, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు. -
‘పాపన్న’ జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి
కొండాపూర్: సర్దార్ పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ఆశన్నగౌడ్ డిమాండ్ చేశారు. కొండాపూర్‌లో గల గౌడ సంఘం కార్యాలయంలో శనివారం గౌడ సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 10 వరకు బస్సుయాత్ర ప్రారంభించామన్నారు. ఈ యాత్ర 7న మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుతుందన్నారు. 8న మెదక్, నర్సాపూర్, దౌల్తాబాద్ల మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుందన్నారు.అనంతరం మద్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డిలో గల ప్రెస్‌క్లబ్‌ల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈయాత్రకు జిల్లాలోని నలుమూలల నుండి గౌడ కులస్థులు, కల్లుగీత కార్మికులు, టీసీఎస్, టీఎఫ్టగీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో బీసీ మండల అధ్యక్షుడు క్రిష్ణాగౌడ్, నాయకులు రామాగౌడ్, మల్లేశంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, అంజాగౌడ్, రమేష్‌గౌడ్, యాదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.