ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..? | ‘Government not providing facilities in Grain centers’ | Sakshi
Sakshi News home page

ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..?

May 8 2017 3:28 PM | Updated on Jul 11 2019 8:38 PM

ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..? - Sakshi

ధాన్యం సెంటర్లలో సౌకర్యాలేవి..?

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలో ప్రభుత్వం సౌకర్యాల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

అల్గునూర్‌(మానకొండూర్‌): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగక రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు.

ప్రభుత్వానికి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించడంపై ఉన్న శ్రద్ధ ధాన్యం మిల్లులకు తరలించడంపై లేదని ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు రైతు చనిపోతే  ఎంపీ కవిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించిందని, కరీంనగర్‌ రూర ల్‌ మండలం దుర్శేడ్‌ గ్రామానికి చెందిన రైతు చనిపోతే ఎమ్మెల్యే, ఎంపీ  పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు.సమావేశంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు దన్నమనేని నర్సింగరావు, నుస్తులాపూర్‌ సర్పంచ్‌ తు మ్మనపల్లి శ్రీనివాస్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయకులు ఎస్‌ఎల్‌.గౌడ్, సురేశ్, రమేశ్, రాజు,సంపత్‌ రాజిరెడ్డి  పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement