ఎంసెట్-2 పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే | government failure in Eamset -2 paper leak | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే

Jul 31 2016 7:33 PM | Updated on Oct 19 2018 7:19 PM

ప్రభుత్వం వైఫల్యంతో ఎంసెట్-2 పేపర్ లీకవడంతో విద్యార్థుల భవిష్యత్ అశనిపాతంగా మారిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు.

- సీఎల్పీనేత జానారెడ్డి
నాగార్జునసాగర్(నల్గొండ జిల్లా)

ప్రభుత్వం వైఫల్యంతో ఎంసెట్-2 పేపర్ లీకవడంతో విద్యార్థుల భవిష్యత్ అశనిపాతంగా మారిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ క్షోభకు గురిచేసిందన్నారు. పేపర్ లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement