క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం | Government encouragement for athletes | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

Aug 19 2016 12:10 AM | Updated on Sep 4 2017 9:50 AM

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని, క్రీడాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.120కోట్లు కేటాయించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు.

  • ఎమ్మెల్యే అరూరి రమేష్‌
  • నవోదయ క్లస్టర్‌ బాల్‌గేమ్స్‌ ప్రారంభం
  • మామునూరు :  రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని, క్రీడాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.120కోట్లు కేటాయించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాల యం క్రీడామైదానంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పడాల సత్యనారాయణ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో జరిగే అండర్‌–14, 17, 19 బాలబాలికల క్లస్టర్‌ బాల్‌గేమ్స్‌ పోటీలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ హాజరై క్రీడా పతాకా న్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర స్థాయి నవోదయ క్లస్టర్‌ గేమ్స్‌ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, షటిల్, బాడ్మిం టన్, వాలీబాల్‌ క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. నవోదయ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు వెలకితీయాలని సూచించారు.
     
    ఇచ్చిన హామీ మేరకు నవోదయ విద్యాలయంలో విద్యార్థు లు శీతాకాలంలో వేడినీటితో స్నానం చేసేం దుకు సోలార్‌ వాటర్‌ హీటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తొమ్మిది జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి చేరుకున్న క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. అంతకుముందు మెుక్కలు నాటారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు కేదారిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు. నవోదయ యాజమాన్యం, విద్యార్థులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు ఆయన చిత్రపటం, మోమెంటోను అందజేసి సన్మానించా రు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు జలగం రంజి త్, పోశాల సదానందం, ఇళ్ల నాగేశ్వర్‌రావు, ఊకంటి వనంరెడ్డి, మాచర్ల కోమారస్వామి, బి.జయశంకర్, శ్రీనివాస్‌రెడ్డి, కుసుమ సతీష్, మేకల సూరయ్య, ఇనుగోల జోగిరెడ్డి, జిల్లా నవోదయ బాలబాలికలు, కోచ్‌లు, బెటాలియన్‌ డీఎస్పీ రవికుమార్, రంగరాజు ప్రకాశ్, ఫార్మసిస్ట్‌ జలగం రమేష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement