కూరగాయలమ్మిన బంగారం వర్తకులు | gold traders sold vegetables | Sakshi
Sakshi News home page

కూరగాయలమ్మిన బంగారం వర్తకులు

Mar 31 2016 10:52 AM | Updated on Sep 3 2017 8:57 PM

బంగారం వర్తకులు టీ, టిఫిన్, కూరగాయలు విక్రయించి తమ నిరసన వ్యక్తం చేశారు.

తిరుపతి: బంగారం వర్తకులు టీ, టిఫిన్, కూరగాయలు విక్రయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పట్టణంలోని చిన్న బజార్ వీధిలో ఈ వినూత్న దృశ్యం చోటు చేసుకుంది. ఆభరణాలపై కేంద్రం విధించిన ఎక్సైజ్ పన్నును ఎత్తివేయాలని కోరుతూ బంగారం వర్తకులు బుధవారం నుంచి బంద్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం షాపులు బంద్ చేసి తమ షాపుల ముందే టీ, టిఫిన్, కూరగాయలను విక్రయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ విధించడం వల్ల బంగారం వ్యాపారం దెబ్బతినే పరిస్థితి దాపురించిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement