త్వరలో పాతగుట్టలో అద్దాల మండపం | Glass atrium in yadagirigutta | Sakshi
Sakshi News home page

త్వరలో పాతగుట్టలో అద్దాల మండపం

Sep 19 2016 11:21 PM | Updated on Sep 4 2017 2:08 PM

త్వరలో పాతగుట్టలో అద్దాల మండపం

త్వరలో పాతగుట్టలో అద్దాల మండపం

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్టలో అద్దాల మండపాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్టలో అద్దాల మండపాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యాదాద్రి విస్తరణ పనుల్లో భాగంగా కొండపైన ఉన్న అద్దాల మండపాన్ని తొలగించి పాతగుట్టకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాతగుట్టలో రూ. 50 లక్షలతో అద్దాల మండపాన్ని నిర్మించనున్నట్లు మాచారం.
పూర్తికావచ్చిన ప్రధానాలయ తొలగింపు
యాదాద్రి విస్తరణలో భాగంగా ప్రధానాలయ తొలగింపు పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. స్లాబ్‌ తొలగించగా ఆలయం చుట్టూ గోడలు మాత్రమే మిగిలిపోయాయి. పశ్చిమ రాజగోపురాన్ని దాదాపుగా తొలగించారు. మరో రెండు రోజుల్లో తొలగింపు పనులు పూర్తి చేసి నాలుగు రాజగోపురాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ దసరాకు రాజగోపురాలకు శంకుస్థాపన చేసి  వచ్చే దసరా నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించే యోచనలో అధికారులు ఉన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement