పూల మార్కెట్ తరలించే ఆలోచన మానుకోవాలి | give up the idea of moving a flower market | Sakshi
Sakshi News home page

పూల మార్కెట్ తరలించే ఆలోచన మానుకోవాలి

Jul 24 2016 7:25 PM | Updated on Sep 4 2017 6:04 AM

నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఉన్న పూల మార్కెట్ తరలింపు ఆలోచనను విరమించుకోవాలని పూల మార్కెట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు షేక్ జానీ డిమాండ్ చేశారు.

నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఉన్న పూల మార్కెట్ తరలింపు ఆలోచనను విరమించుకోవాలని పూల మార్కెట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు షేక్ జానీ డిమాండ్ చేశారు. మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాల పేరుతో వందకు పైగా ఉన్న పూల దుకాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రత్యామ్నాయంగా గొల్లపూడి మార్కెట్‌లో స్థలం చూపుతామని అధికారులు సూచించారని అన్నారు. అయితే అన్ని వసతులు కల్పించిన తర్వాతే మార్కెట్ తరలింపు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement